Source : http://ulikipitta.wordpress.com/
నిన్న ఒక టపా చూసాను. నరేంద్ర మోడీ ని హిట్లర్ తో పోలుస్తూ రాసిన టపా. చూడగానే మైండు బ్లాకయ్యింది. కళ్ళు బైర్లు కమ్మాయి. నేను జీవిస్తున్నది ఊహాజనిత అతిశయోక్తుల ప్రపంచములోనా? ఇక్కడ దోమలు, చీమలు డైనోసార్ల కంటే ప్రమాదకరమైనవి అయ్యుంటాయా? వానపాములు… కింగు కోబ్రాలు, సముద్ర సర్పాలా కన్నా విషపూరితమైనవి అయ్యుంటాయా..?? లాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు నా బుర్రనిండా గింగిరాలు తిరిగాయంటే నమ్మండి. లేకపోతే హేమిటీ విచిత్రం. నరేంద్ర మోడీని హిట్లర్ తో పోల్చడమా..!!
సరే, ఆపోలికలేంటో చూద్దామని చదివితే.. నేను చదివేది ఒక మాంచి హాస్యరస భరిత వ్యాసమని అర్థమయ్యింది…… మోడీ, హిట్లరూ ఇద్దరూ శాఖాహారులంట. (ఇదేం దిక్కుమాలిన పోలిక? ఇంకా నయం, మోడీ, హిట్లరు ఇద్దరు మగాళ్ళే అన్నాడు గాదు)
మోడి, హిట్లరు అధికారములోకి వచ్చినప్పుడు పరిస్థితులు ఒకేలా ఉన్నాయట… (ఆ ఉంటే? ఒక్కటే అయిపోతారా?) ఇద్దరూ మైనారిటీలను తుదముట్టించారట, వారి పట్ల విషాన్ని కక్కారట. (ఖర్మరా నాయనా..!! ఈ మేతావుల దృష్టిలో కాలం గుజరాత్ అల్లర్ల వద్దే ఆగిపోయుంటుంది. దాన్ని దాటి ఒక్క క్షణం ముందుకు కూడా రారు )
అయ్యా బాబులూ, గుజరాతు మారణకాండ దాదాపుగా దశాబ్ద కాలం నాటిది. దాని తరువాత చాలా మార్పులు జరిగాయి. కానీ, అలాంటి మారణ కాండ మల్లీ ఎక్కడా జరగలేదు, గుజరాతులో కూడా జరగలేదు. కానీ, హిట్లరు.. సుదీర్గకాలం యూదుల మీద దాడులు జరగడానికి కారణమయ్యాడు. మరి, ఇద్దరికీ పోలికేంది. దిక్కుమాలిన తెలివి తేటలు కాకపోతే.
సరె, అయ్యవారు ఇంకా ఏమి రాశారని చూస్తే, అబ్దుతమైన హాస్యగులిక ఒకటి ఆయన బ్లాగులో ఒక వ్యక్తికి ఇచ్చిన కామెంటు రూపములో తగిలింది. అతను మోడీని హిట్లరుతోనే పోల్చాడడ. అంతే కానీ, హిట్లరు చేయించిన నరమేధముతో పోల్చలేదట.
ఇది మాత్రం కేక. యూదుల మీద జరిగిన నరమేధాన్ని పక్కన పెడితే.. హిట్లరు చెడ్డవాడేమీ కాదు. అతనో గొప్ప నాయకుడు. అతనితో పోల్చడం తప్పే కాదు. కాబట్టి, ఆ వ్యాసం రాసిన వ్యక్తి, హిట్లరును గొప్పనాయకుడు అని పొగిడినట్టులెక్క. కొంతమంది కామ్రేడిపండ్లు, లౌకిక ఊసరవెల్లులు తప్ప మిగిలిన వారందరూ అదే కదా అంటున్నది?
కాకపోతే నా ఆలోచన అక్కడితో ఆగలేదు. ఎందుకు వీరు అంతా హిట్లరును అంత పెద్ద రాక్షసునిలా చూపుతున్నారు. హిట్లరే అందరికంటే ఘోరమైన నేరాలు చేశాడా అన్న అనుమానం రావడంతో గూగులమ్మను వివరం అడిగా. వచ్చిన ఫలితాలను చూస్తే నాకు చాలా ఆశ్చర్యమేసింది. హిట్లరుకన్నా పెద్ద నీచులు ఇద్దరు ఉండడమే దానికి కారణం.
మన దేశములో తిష్టవేసుకున్న కామ్రేడిపండ్లు (Thanks to Snkr for a beautiful word to describe our Errababus) తమ నోటి దుర్వాసనను పుస్తకాలలో ఐతే నేమి, మీడీయాలో అయితే నేమి… చాలా చక్కగా అందమైన రంగుల్లో, సుగర్ కోటింగ్ చేసి ఆ ఇద్దరినీ గొప్ప నాయకులను చేసేశారు. వారితో పోలిస్తే హిట్లరు పిల్లకాకి. ఆ మహానుభావులు మరెవ్వరో కాదు, స్టాలిన్, మావో జెడాంగ్.
హిట్లర్ ఎంత మంది చావడానికి కారణమయ్యాడు, స్టాలిన్ ఎంతమంది చావుకు కారణమయ్యాడు, మావో ఎంత మంది చావుకు కారణ మయ్యాడు? ఒక్కసారి గూగులమ్మని అడిగి చూడండి మీకే తెలుస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో కారణం చూపించి చంపారు. మరి స్టాలిన్, మావో దేముల్లు, మా హిట్లర్ దెయ్యమా.. హన్నా? ఏమిరా ఈ కామ్రేడిపండ్ల చతురత?
హిట్లర్ – 12,000,000 మంది
స్టాలిన్ – 23,000,000 మంది
మావో జెడాంగ్ – 49 నుండి 78,000,000 మంది
ఈ లెక్కన, హిట్లరు బాబాయికన్నా, స్టాలిన్ బాబాయి డబల్ నీచుడు. వీల్లద్దరినీ కలిపినా మావో ముందు జుజుబీ. ఒక్కసారి ఈ లింకును దర్శించండి.
The worst genocides of the 20th Century
స్టాలిన్ను మావోను ఆరాధించే వీరు, నక్సలైట్లను ప్రేమించే వీరు, చక్కని పాలన అందించే మోడీని అభిమానించే వారిని హిందూత్వవాదులని, అత్యంత ప్రమాదకారులని ఎంత చక్కగా వర్ణిస్తారో. ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అంటే ఇదేనేమో.
బహుషా హిట్లరుకు వీరిద్దరికన్నా చెడ్డపేరు రావడానికి కారణం, హాలీవుడ్డులో బలమైన స్థానం సంపాదించుకున్న యూదులేనేమో.
P.S: వ్యాసాలే కాదు, దానికి వచ్చిన వ్యాఖ్యలు చదివితేనే అందులో ఉన్న నిజానిజాలు బయటకి వస్తాయి. కాబట్టి, ఆ వ్యాసము రాసిన రచయితను కడిగి పారేసిన వ్యాఖ్యలు చదవాలనుకుంటే ఈ కిందిచ్చిన లింకు చూడండి.
Narendra Modi and Adolf Hitler
ముఖ్యంగా తొమ్మిదవ వ్యాఖ్య (By Kerty) చూడండి. అయ్యవారి చరిత్ర ఙ్ఞానాన్ని Selective Amnesia, Gobbelian propaganda గానూ తేల్చి పారేశాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి