19, ఫిబ్రవరి 2012, ఆదివారం

అక్బర్ ఇలా గ్రేట్ అయ్యాడు!

అక్బర్ ఎంత స్త్రీ లోలుడో ఇది చదవండి.'నీ భార్య నాకు నచ్చింది. కాబట్టి ఆమెకు విడాకులిచ్చి నాకు వొదిలెయ్' అని ఎవరినైనా ఆదేశించగల ధర్మప్రభువు ఆయన. 1564లో ఒకసారి ఢిల్లీ వీధుల్లో వెళుతుంటే మిద్దెమీది నుంచి అక్బర్ మీద పులాద్ అనే బానిస బాణం చేశాడు.. అది భుజంలోకి దిగి గాయమైంది. రాజభటులు దుండగుడిని పట్టుకుని అక్కడికక్కడే ముక్కలుగా నరికారు. వాడిచేత హత్యాయత్నం ఎవరు చేయించారో ఆరా తీయాలని అధికారులు అనుకున్నారు. కాని చక్రవర్తి వద్దని వారించాడు. అక్బర్ డిల్లీలో 'మీనాబజార్' వ్యవస్థను పోషించేవాడు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏటా అక్కడ జరిపే నౌరోజ్ ఉత్సవాల్లో హిందూ సామంతులందరూ తలా ఒక స్టాల్ తెరిచి తమ రాజ్యంలోని అందమైన ఆడవారిని ప్రదర్శిస్తే, చక్రవర్తి వెళ్లి చూసి తనకు నచ్చినవారిని సెలక్టు చేసుకుని అంతఃఅపురానికి తోలుకెళ్లేవాడు.


In vincent smith words...
'Akbar was then engaged in a scheme for marrying certain ladies belonging to Delhi families, and had compelled one Shaikh to divorce his wife in his favour. The attempted assassination put an end to these discreditatable proceedings, and probably was prompted by resentment at the royal invasion of the honour of families. Akbar, throughout his life, allowed himself ample latitude in the matter of wives and concubines...[Akbar The Great Mogul, P.47]


ఇదే సందర్భంలో అబుల్ ఫజల్ పేర్కొన్న ఇంకో విశేషాన్ని గుర్తు చేసుకోవాలి. రాజప్రముఖులకు చెందిన భార్యలు, 'సౌశీల్యానికి పేరుబడ్డ బేగం లు తమను తాము చక్రవర్తికి సమర్పించుకోదలిస్తే తమ కోరికను రాణివాసం సేవకులకు తెలిపి జవాబుకోసం నిరీక్షించేవారట. ఆ సేవకులేమో రాజభవనం అధికారులకు తెలపగా వారు విన్నపాలను పరిశీలించి అర్హులనుకున్నవారిని అంతఃఅపురంలోకి అనుమతించే వారట. మంచి హోదాగల మహిళలు కొందరికైతే పూర్తిగా నెలరోజులపాటు అక్కడ గడపటానికి అనుమతి దొరికేదట. [Ain-I Akbari by H.Blochmann, Vol-p.47]


ఆడవారి విషయంలో అక్బరు గొప్ప సోషలిస్టు. తాను జయించిన లేక లొంగదీసుకున్న హిందూ రాజ్యాల రాజవంశాల నుంచి కనీసం తలా ఒక కన్యను అంతఃపురానికి పంపలన్న కంపల్సరీ ఏర్పాటువల్ల... రాజపుత్రులను మంచి చేసుకునే వ్యూహంలో భాగంగా ఆయా రాజకుటుంబల కన్యలను అక్బర్ స్వయంగా తానో, తన కుటుంబీకులకో పెళ్లి చేసుకోవడంవల్ల అంతఃపురంలో రాణుల సంఖ్యే చాలా హెచ్చుగా వుండేడి. వీరికితోడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు టెంపరరీ వీసాపై ఖజానాకు తోలిన రాజప్రముఖుల భార్యలు, ఇంకా 'మీనాబజార్' నుంచి ఏటేటా కొట్టుకొచ్చే హిందూ స్త్రీలు- వీరందర్తో అక్బర్ జనానా శరణార్థుల శిబిరంలా ఎప్పుడు కిటకిటలాడుతూండేది. అంతఃపురంలో 5వేల రాణులు వుండేవారని, వారికి తలా ఒక గది ప్రత్యేకంగా వుండేదని అబుల్ ఫజల్ పచ్చి అబద్దమైతే ఆడాడు కాని అక్బర్ కాలంలో 5వేల గదులుగల రాజప్రాసాదం ఏదీలేదు. ప్రతి గదిలోనూ పట్టినంత మందిని క్ ఉక్కిన దుర్భరస్థితి చాలదనంటు అంతఃఅపుర స్త్రీలకు ఎందరో మొదుళ్లు! చక్రవర్తికి దయకలిగితే ఏ కొలువులోని ఏ ప్రముఖుడైనా ఏ అంతఃపుర స్త్రీనైనా ఇష్టనుసారం అనుభవించవచ్చు.


Grimon's statement that Akbar had confined himself to one wife, and distributed his other consorts among the cuortiers is not directly confirmed from other sources. It is unlikely that the assertion should have been wholly baseless, because the other statements of fact attributed to Grimon are supported more or less by independent testimony. Probably Akbar really did repudiate some of the hundreds of women in his harem and distributed them among his nobles. His record renders it improbable that he should have gone as far as to restrict himself to one wife.[Akbar The Great Mogul.p.185]


హిందూ స్త్రీలను పెళ్లాడటం అక్బర్ సెక్యులరిజానికి, హిందూ-ముస్లిం సమైక్యతపట్ల అతడి నిబద్దతకూ నిదర్శనమని మూర్ఖంగా వాదించే మన మేధావులు 1568 లో రణతంభోర్ కోటను మాయాదౌత్యంతో కైవసం చేసుకునే సందర్భంలో అక్బర్కూ,సుర్జన్ రాయ్ కూ కుదిరిన సంధి ఒడంబడికను ఒకమారు పరికిస్తే మేలు. అ ఒప్పందంలోని మొట్టమొదటి అంశమే... రాజపుత్రులకు అవమానకరమైన విధంగా రాజాంతఃపురానికి వధువును పంపడమనే ఆచారం నుంచి బుందీ రాజ్య పాలకులకు మినహాయింపు వుంటుందని! అలాగే... నౌరోజ్ ఉత్సవంలో రాజప్రాసాదం వద్ద మీనాబజార్ లో స్టాల్ నిర్వహించడానికి తమ భార్యలను, తమకు బంధువులైన మహిళలలు పంపే ఏర్పాటు నుంచి బుందీ ప్రభువులకు మినహాయింపు వుంటుందన్నది ఇంకో ముఖ్యమైన షరతు. [Akbar The Great Mogul, p.7]


హిందూ-ముస్లిం ఐక్యతకు, సాంస్కృతిక అనుబంధానికి మతాంతర వివాహం చక్కని సాధనమన్నదే అక్బర్ ఆశయమని అమాయకంగా నమ్మే అల్పబుద్దులు- అదే నిజమైతే అక్బర్ తన ఇంటి స్త్రీలను ఎంతమంది హిందువులకిచ్చి పెళ్లి చేశాడని ఎప్పుడైనా ఆలోచించారా? పెళ్లి పేర అమాయక బాలికల గొంతుకోసి, నిఖాకాగానే వ్యభిచారంలోకి నెట్టి మన కలంలో వార్తలకెక్కిన అరబ్ షేక్ లకంటే
'అక్బర్ ది గ్రేట్ '
ఏ విధంగా గొప్పో మీరే నిర్ణయించండి.


http://theuntoldhistory.blogspot.in/2008/01/blog-post.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి