19, ఫిబ్రవరి 2012, ఆదివారం

తాజ్ మహల్! మనకు తెలియని కట్టడం-I

తాజ్ మహల్ ని ఎవరు కట్టించారన్నది చచ్చు ప్రశ్న. ఏ హైస్కూలు పిల్లలైనా చెప్పే సమాధానానికి ఈ రోజు ఈ చచ్చు ప్రశ్నేంటి అని విసుక్కుంటాం! వందల సంవత్సరాల తరబడి మన చరిత్రకారులందరూ కళ్లు మూసుకొని గుడ్డిగా ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నారన్నది ఆక్షేపించలేని విషయమే. అవును మరి. ఒకరా ఇద్దరా! ఇంతమంది లబ్దప్రతిష్టులైన చరిత్రకారుల్ని ఈ వొక్క మాట తో అబద్దమని ఎలా తేల్చేయగలం? .
ఇన్ని సంవత్సరాల నుంచి నిజమని అనిపించి ఇప్పుడు మాత్రం అబద్దమని ఎలా అనిపిస్తుంది. కొత్తగా ఏమన్నా రుజువులు దొరికాయా ?

కాదు. ఇవేం కాదు. ఇప్పుడు మాత్రమే అనిపించటం కాదు. వంద సంవత్సరాల క్రిందే మొత్తుకున్నారు. ఇది తాజ్ మహల్ కాదని, రాజమహల్ అనీ, అసలు, సమాధి మందిరాన్ని 'మహల్ ' అని పిలవటం ప్రపంచంలోని ఏ ముస్లిం సమాజంలోనూ లేదని . అంతెందుకు ! తాజ్ మహల్ ను షాజహాన్ కట్టించినట్టు గాని, ముంతాజ్ ను అక్కడ ఖననం చేసినట్టుగానీ, అనంతర కాలంలో షాజ్ హన్ ను అక్కడ పూడ్చినందుకు దాఖలాగా కానీ తాజ్ మహల్ వద్ద ఒక శాసనమూ లేదు. ఒక శిలాఫలకమూ లేదు.

ఎందుకని?

మరెందుకు చరిత్ర వక్ర మార్గం పట్టింది.ఎంతో మంది దీని గురించి రుజువుల్ని చూపినా ఇంకా కూడా హైస్కూలు చరిత్ర పాఠాల ధగ్గిరనుంచి, ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా వరకూ అవే అరిగిపోయిన పాఠాల్ని మనం అరిగిపోయిన రికార్డులా ఇంకా వల్లె వేసుకుంటున్నాం?

ఒకసారి తాజ్ మహల్ గురించి మనం చదువుకున్నదీ, తెలిసిందీ అవలోకించుకుందాం!

ప్రామాణికమైన ఆధునిక విజ్ఙాన సర్వస్వంగా అందరూ పరిగణించే బ్రిటానికా ఏం చెబుతుందో చూడండి.
'ముంతాజ్ 1631 లో మరణించగా 1632 లో భవన నిర్మాణం మొదలైంది. ఇండియా, పర్షియా, మధ్య ఆసియా, ఇంకా ఆవలి నుంచి కూడా వచ్చిన ఆర్కిటెక్టుల మండలి వేసిన ప్లాన్ల ప్రకారం రోజూ ఇరవై వెలకు పైగా పనివారు కష్టించి 1643 నాటికి (అంటే పదకొండేళ్ల తర్వాత) మాసోలియం (సమాధి మందిరాన్ని)పూర్తి చేశారు. మొత్తం తాజ్ కాంప్లెక్స్ నిర్మాణానికి 22 ఏళ్లు పట్టింది. నాలుగు కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి '.

అక్టోబర్ 03, 1984 రోజు ప్రొ.మార్విన్.హెచ్.మిల్స్(న్యూయార్క్)భారతప్రభుత్వానికీ, ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించిన తన పరిశోధన పత్రంలోని సారాంశం చూడండి.

తాజ్ నుంచి కనీసం 20 సాంపిల్స్ తీసుకుని కార్బన్ డేటింగ్ తో విశ్లేషిస్తే తాజ్ మహల్ షాజహాన్ కంటే 300 ఏళ్ల కిందటిదని తేలింది.

మరయితే మనం చదువుకున్నదానికీ, దీనికి ఇంత వ్యత్యాసం కనబడుతోంది.
ఇదెలా జరిగింది?


 http://theuntoldhistory.blogspot.in/2007/10/i.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి