18, ఫిబ్రవరి 2012, శనివారం

కామెడీ కేతిగాళ్ళకి మరింత గడ్డి


పిడతలమ్ముకునే వాడికి చిడతలు వాయించే, స్వయంప్రకటిత మేథావులకు ఓ బ్రహ్మాండమైన అనుమానం వచ్చింది. అదేమిటంటే "భారతమాత అనేదే ఓ కాల్పనిక కాన్సెప్టు. నిజానికి అది భారత పిత ఎందుకు కాకూడదంటారు!"

శోధన, సాధన చేసిన జ్ఞానమే శాశ్వతమని నమ్మే కేతిగాళ్ళు, ఒకటో తరగతిలో ఉన్నప్పుడు, పాఠ్యపుస్తకాలు శోధన చేయలేకపోయినందుకు - వారికి నా ప్రగాఢ సానుభూతి. పుస్తకాల మొదటి పేజీల్లోనే ఉండే "ప్రతిజ్ఞ" "భారత దేశము నా మాతృ భూమి. భారతీయులందరూ నా సహోదరులు...." చదివినట్లు లేరు.


దేవాలయాల్లో బూతుబొమ్మలు వెదుక్కునే వీరి కళ్ళకి, ఎమ్మెఫ్ హుస్సేన్ బొమ్మల్లో బూతులు కనిపించకపోవటం విడ్డూరమే! బహుశా, అమ్మను నాన్న అని ఎందుకు అనలేదో, నాన్నను అమ్మా అని ఎందుకు అనలేదో ఇంకా శోధిస్తున్నట్లున్నారు - దేవాలయాల్లో బూతు బొమ్మలు శోధిస్తున్నట్లుగా!


రెండు మూడక్షరాల సాయిబు గారు - ఏమిటి కళ! ఎవరు కళాకారుడు!! ఏ కళైనా, కళాకారుడైనా, మానవ సంబంధాలను మించి మాత్రం కాదు. ప్రజల మధ్య విద్వేషాలు పెచ్చరిల్లజేసి, ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే ఓ ఉన్మాదిని, కళాకారుడుగా నెత్తిన పెట్టుకునే దౌర్భాగ్యం మీ సంస్కారమైతే, ఒక తస్లీమాను, మరో సల్మాన్ రష్దిని నెత్తిన పెట్టుకుని ఏడవొచ్చుగా. మెజారిటీ హిందువుల భావోద్వేగాలు తోసిరాజనే మీరు, రేపు ఒక హిందు కళాకారుడు, మహమ్మద్ ప్రవక్త తన భార్యలతో నగ్నంగా కులికే బొమ్మలు గీస్తే, ఊరుకుంటారా?


బాత్రూముల్లో బొమ్మలేసుకునే స్థాయిలోనే ఉన్న ఎమ్మెఫ్ హుస్సేన్ లాంటి, తదితర కామెడీ భ్రష్టుల కోసమేనేమో, తెలుగు కళాకారుడు వేటూరి గారు, ప్రతిఘటన అనే సినిమాలో "ఈ దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీత లోకంలో...." అంటూ గడ్డి పెట్టారు.


"నియో దళితిస్టు భావజాలంతో" ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే ఇటువంటి కామెడీగాళ్ళ కుహానా మేధావితనాన్ని, కుహానా భావ ప్రకటనా స్వేచ్ఛను మొగ్గలోనే తుంచకపోతే, ఇంటికో దేశద్రోహి తయారౌతాడు. ముందుగా వీరందరి మీద అట్రాసిటీ కేసు పెట్టాలి.




http://amtaryaanam-1968.blogspot.in/2010_03_01_archive.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి